Dhatipobokayaa Song Lyrics :
దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా (2)
యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా
నా వేదనకు మితి లేదు నా శోకానికి తుది లేదు
నీవు గాక జీవితాన ఆశయే లేదు (2)
నీవు గాక జీవితాన ఆశయే లేదు
నా కోసం నువు వస్తావనీ
నా ఆర్త ధ్వని వింటావనీ (2)
ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను (2)
॥దాటిపోబోకయ్యా ॥
అవమానాల నా బ్రతుకే ఆవేదనలో నిను వెతికే
నీవు రాక దిక్కులేక దీనమైపోయే (2)
నీవు రాక దిక్కులేక దీనమైపోయే
నా కోసం నువు వస్తావనీ
నా ఆర్త ధ్వని వింటావనీ (2)
ఎదురు చూస్తున్నాను… నిదుర కాస్తున్నాను (2)
॥దాటిపోబోకయ్యా ॥