Jagamulanele Paripaalaka Song Lyrics
జగములనేలే పరిపాలకా.. జగతికి నీవే ఆధారమా..
ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గానము
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య..
(జగములనేలే)
1. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నువ్వు మోయగా సులువాయే పయనమూ
నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే (2)
నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే (2)
యేసయ్యా … యేసయ్యా.. నీ కృప చాలయ్యా…
యేసయ్యా …యేసయ్య… నీ ప్రేమే చాలయ్యా..
(జగములనేలే)
2. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభ తరుణము నాకిది నీ భాగ్యమా (2)
జీవితమంతా నీకరిపించి నీ ఋణము నే తీర్చనా (2)
యేసయ్యా … యేసయ్యా …నీ కృప చాలయ్యా
యేసయ్యా … యేసయ్యా ..నీ ప్రేమే చాలయ్య
(జగములనేలే)
3. పరిశుద్ధుడా సారిదివై నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే
నా విశ్వాసము నీపై ఉంచి విజయము నీ చాటనా
నా ప్రతి క్షణము ఈ భావనతో గురు యొద్దకే సాగేదా…(2)
యేసయ్య … యేసయ్యా… నీ కృప చాలయ్యా..
యేసయ్యా … యేసయ్యా … ప్రేమే చాలయ్యా..
(జగములనేలే)