Krupa Chalunu Nee Krupa Chalunu Song Lyrics :
కృప చాలును – నీ కృప చాలును (2)
ఎన్నటెన్నటికీ నీ కృప చాలును
తరతరములకు నీ కృప చాలును
(కృప చాలును)
ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం
జీవము కంటే కృప ఉత్తమం (2)
కృపయే లేకుంటే మనుగడ లేదు
కృపను మించిన పెద్దది లేదు (2)
(కృప చాలును)
కృపలోనే పాపక్షమాపణ
కృపలోనే ఇల మా రక్షణ (2)
కృపలోనే మా నిరీక్షణ
కృపలోనే మా క్రమశిక్షణ (2)
(కృప చాలును)
కృపలోనే మా అభిషేకము
కృపలోనే మా ఆనందము (2)
కృపలోనే మా అతిశయము
కృప వెంబడించి కృపను పొందెదం (2)
(కృప చాలును)