Parimala Thailam Neeve Song Lyrics :
పరిమళతైలం నీవే – తరగని సంతోషం నీలో
జీవనమకరందం నీవే – తియ్యని సంగీతం నీవే
తరతరములలో నీవే – నిత్యసంకల్పసారధి నీవే
జగములనేలే రాజా – నాప్రేమకు హేతువు నీవే
1.ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్నశోధనలో
నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు “2”
క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు
నీమనస్సే అతిమధురం అది నాసొంతమే “పరిమళ”
2.చీల్చబడిన బండనుండి నా – కొదువ తీర్చి నడిపితిని
నిలువరమగు ఆత్మశక్తితో- కొరతలేని ఫలములతో “2”
నను నీ రాజ్యమునకు పాత్రునిచేయ – ఏర్పరుచుకొంటివి
నీ స్వాస్థ్యములో నే చేరుటకై – అభిషేకించినావు
నీ మహిమార్థం వాడబడే నీ పాత్ర నేను “పరిమళ”
3. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని
సిద్ధపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని “2”
నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై
నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై
యుగయుగములలో నీతో నేను నిలిచి పోదును “పరిమళ”