Yesayya Naa Gana Daivamaa Song Lyrics :
యేసయ్యా నా ఘన దైవమా……
నా అభిషేక తైలమా- ఆనంద సంగీతమా(2)
నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం (2)
(యేసయ్య నా ఘన దైవమా)
1. నా ప్రార్థనలను ఆలించు వాడవు
ప్రార్థనలన్నీ నెరవేర్చు వాడవు (2)
మాటతప్పని దేవుడ నీవు (2)
మదిలో వ్యధను తొలగించిన (2)
(నీకే నా స్తోత్రము)
2. నా గాయములను మాన్పు వాడవు
నూతన బలమును దయచేయు వాడవు (2)
మనసును గెలిచిన మగధీరుడవు (2)
మనవులన్ని మన్నించిన (2)
(నీకే నా స్తోత్రము)
3. నా శత్రువులను ఎదిరించు వాడవు
ముందు నిలిచిన నజరేయుడవు (2)
ప్రేమను పంచిన త్యాగధనుడవు (2)
హృదయమందు నివసించిన (2)
(నీకే నా స్తోత్రము)